20-07-2025 10:02:37 PM
సుమారు 6 లక్షల ఆస్తి నష్టం
పాపన్నపేట: షార్ట్ సర్క్యూట్ తో నివాస గృహం దగ్ధమైన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంతగోని సాయిబాబా కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రతిరోజూ లానే ఆదివారం రోజు సైతం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమైంది. ఇంటి పైకప్పు నుంచి నిప్పుతో కూడిన పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలు ఆర్పేశారు.
ఈ అగ్నిప్రమాదంలో సాయిబాబ ఇంట్లోని వంట సామాగ్రి, బట్టలు, వెండి, నగదు మంటల్లో బూడిద అయ్యాయి. సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. కట్టుబట్టలె మిగిలాయాని ఎలా బ్రతకాలి అని బాధిత కుటుంబం కన్నీరు పెట్టుకున్న ఘటన అందరిని కలిచివేసింది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుని తగిన సహాయం చేయాలనీ ఈ సందర్బంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నివాసం ఉంటున్న ఇళ్ళు పూర్తిగా కాలిపోవడంతో ఉండే పరిస్థితి కూడా లేనందున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరి చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.