20-07-2025 12:30:50 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి అందివ చ్చిన అవకాశంలో రాజకీయ లక్కీభాస్కర్ అని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెళ్లిన ప్రతిచోటా పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారని, ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఖండించారని ఎద్దేవా చేశారు.
ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కూల్‌కు ఇంతవరకు దిక్కు లేదని, మళ్లీ మరో పాఠశాలకు శంకుస్థాపన చేశారని ఫైర్ అయ్యారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించాల్సిన స్థలాలను మార్చారన్నారు. మోదీ భక్తుడు అయినందుకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్‌ఇవ్వడం లేదని, గురుదక్షిణ కింద చంద్రబాబుకు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
తన శాఖలో డబ్బులు లేవని మంత్రి వాకిటి శ్రీహరి అంటున్నారని, బీసీలకు రెవెన్యూ శాఖ ఇవ్వాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కొట్లాడాలి తప్ప చంద్రబాబు ను ప్లీజ్ అని ఆడుక్కోవద్దన్నారు.