19-07-2025 08:04:51 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు లారీ డీ కోనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎల్లారం వద్ద కే కే వై జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ కు కూడా గాయాలైనట్లు తెలిపారు.
అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకపోవడం వల్లే మూలమలుపు గా ఉన్న ఎల్లారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి లింగంపేట పోలీసులు చేరుకొని గాయపడిన వారిని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి మరికొందరిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బస్సులో వందమంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చేరుకొని గాయపడిన ప్రయాణికులను ఆటోలల్లో 108 అంబులెన్స్ లో తరలించినట్లు తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.