calender_icon.png 20 July, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సానిటరీ వెండింగ్ మిషన్ ప్రారంభం

19-07-2025 10:45:39 PM

మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు సానిటరీ వెండింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ మయాంక సింగ్(Sub-Collector Mayank Singh) తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మహదేవపూర్ మండలంలోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో శానిటరీ వెండింగ్ మెషిన్, ఇన్సినరేటర్‌ను జిల్లాలో మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్‌గా శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, విద్యార్థినులకు అవసరాలను గుర్తించి, వారికి శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ మిషన్ విద్యార్థినులు ఆరోగ్యం, శుభ్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.