20-07-2025 01:26:10 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే.. శాస్త్రీ యం.. ప్రామాణికం.. నమ్మకమైనదని (సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్) కులగణనను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిపు ణుల కమిటీ చేసిన అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిపుణులు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్యదర్శి వీ శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఈ శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిపు ణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డాక్టర్ సుఖదేవ్ తొరాట్, నిఖిల్‌డే, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ జీన్ డ్రెజ్, ప్రొఫెసర్ థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తమ నివేదికను ప్రభుత్వానికి అందించారు.
క్యాబినెట్‌లో చర్చించి.. తదుపరి చర్యలు
రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అంటూ పేర్కొ న్న నిపుణుల కమిటీ.. తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, ఇది దేశానికే రో ల్ మోడల్‌గా మారుతుందని అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన 300 పేజీల నివేదికలోని అంశాలను, సూచనలను క్యాబినెట్‌లో చర్చించి ప్రభుత్వం తదు పరి చర్యలు తీసుకోనుంది. సామాజిక న్యా యం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.
సర్వేకు భారీ యంత్రాంగం..
మొదటి దశలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25 వరకు 50 రోజులపాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతీ జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను, ప్రతీ 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమ రేటర్లు, సూపర్‌వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించారు.
మొదటి విడతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజు ల్లో డేటా ఎంట్రీ చేయించారు. మొదటి దశలో హౌజ్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవడంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ, ఎంపీడీవో కార్యాలయాలు, వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేయించుకున్నారు.
ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. ఇందులో 1,12,36,849 (97.10 శాతం) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సమగ్ర కులగణన సర్వే ఫలితాల ప్రకారం.. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,249 మంది (17.42 శాతం), ఎస్టీలు 37,08,408 మంది (10.43 శాతం), బీసీలు 2,00,37,668 మంది (56.36 శాతం), ఇతర కులాలకు చెందినవారు 56,13,389 మంది (15.89 శాతం) ఉన్నారు.
ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసిన విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి, వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.
వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన నిపుణుల కమిటీ.. డేటాను సేకరించిన పద్ధతి నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతోపాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపర్చేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల అభ్యున్నతిని మెరుగుపర్చేందుకు సహాయపడుతుందని నిపుణుల కమిటీ సూచించింది.
దేశ దిశను మారుస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా వచ్చిన విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రశంసించారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చరిత్రాత్మకమైనదని, వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఎలాంటి ముద్రలు లేని వివాద రహితులను కమిటీ సభ్యులుగా నియమించామన్నారు.
రాష్ర్టం లో చేపట్టిన సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, కులగణన కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నప్పటికీ అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని బాధ్యతతో పని చేయడంతో సర్వే నిర్వహణ విజయవంతమైందన్నారు.
ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్..: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో చేసిన కులగణన సర్వే కేవలం డేటా కాదని.. అది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కులగణనపై ఏర్పాటుచేసిన స్వతంత్ర నిపుణుల కమిటీతో శనివారం ఎంసీహెచ్‌ఆర్డీలో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ నా యకుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సా మాజిక న్యాయాన్ని అమలుచేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నా రు. అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు కారణాలపై నిపుణుల క మిటీ అధ్యయనం చేయాలని తాను కోరుతున్నానని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరుతున్నట్టు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.