calender_icon.png 20 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనెప్పుడూ అలా చెప్పలేదు !

11-05-2024 12:45:52 AM

కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్

న్యూఢిల్లీ, మే 10: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ)ని తానెప్పుడూ కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పలేదని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సతారా పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ 2001 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నదని, ఎన్నికల్లో గెలిచి మంత్రివర్గంలోనూ భాగస్వామిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపామని గుర్తుచేశారు. రెండు పార్టీలు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాయని, కాబట్టే తమ కూటమి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో శివసేన (యూబీటీ) వంటి ప్రాంతీయ పార్టీ విలీనమవుతుందా? అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు..‘పొత్తులో భాగంగా మేం శివసేన (యూబీటీ)తో కలిసి పనిచేస్తున్నాం. ఆ పార్టీకి ఉన్న స్వతంత్ర గుర్తింపు ఉంది. ఏ పార్టీతో సంబంధం లేకుండా అది తన ఉనికిని చాటుకోగలదు’ అని సమాధానమిచ్చారు.