calender_icon.png 20 July, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కుంభం సహకారంతో వలిగొండ నుండి ఉప్పల్ కు షటిల్ బస్సు సౌకర్యం

20-07-2025 02:18:51 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల ప్రజల కోరిక మేరకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి ఇబ్బందులను తొలగించేందుకై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వలిగొండ నుండి ఉప్పల్ కు షటిల్ బస్సును ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం వలిగొండ నుండి 6 గంటలకు బయలుదేరుతుందని రోజులో నాలుగు సార్లు ఈ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని,

ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వలిగొండ కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, కొండూరు భాస్కర్, బత్తిని సత్యనారాయణ, బత్తిని అరుణ్ కుమార్, జూకంటి నరసింహ, ఎమ్మే మల్లేశం, జూకంటి ముత్యాలు, ఎమ్మె శేఖర్, సంగిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.