19-07-2025 02:51:34 PM
వన్ టౌన్ పరిధిలోని సెల్ఫోన్ పోగొట్టుకున్న 35 మంది బాధితులకు అందజేత
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): సెల్ఫోన్ పోగొట్టుకున్న వారికి సిఈఐఆర్ పోర్టల్ ఒక గొప్ప వరం లాంటిదని డీఎస్పీ కె శివరాం రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, గతంలో వేరువేరు కారణాలతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 35 మంది బాధితులకు ట్రేస్ చేసి సెల్ ఫోన్లు అందజేసి మాట్లాడారు. బాధితులు దొరకవు అనుకున్న ఫోన్లు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.