20-07-2025 06:12:17 PM
ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమమే నా ఆకాంక్ష..
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ముత్యాల పోచమ్మ ఆశీస్సులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు పెద్దఎత్తున బోనాలు తీసి ఊరేగించారు. అమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ముత్యాలమ్మను ఊరేగించారు. ఎల్లారెడ్డి పట్టణంలో అతిపెద్ద ఉత్సవం బోనాల ఉత్సవంతో పాటు పల్లారా బండి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, చింతల శంకర్, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావును ఘనంగా సన్మానించారు.