calender_icon.png 19 July, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రంట్ లైన్ సూపర్‌ వైజర్లకు నిర్మాణాత్మక శిక్షణా కార్యక్రమం

19-07-2025 12:46:21 PM

ఇల్లందు,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని యం.వి.టి.సి. ఫ్రంట్ లైన్ సూపర్‌ వైజర్లకు(Front line supervisorsనిర్మాణాత్మక శిక్షణా కార్యక్రమాన్ని యం.వి.టి.సి మేనేజర్ పి.మహేశ్వర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జి.యం మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ సూపర్‌ వైజర్ లు సింగరేణికి చాల ప్రాధాన్యం కలవారని, అధికారులకు ఉద్యోగులకు వారదులుగా పని చేశారని అన్నారు. ఈ శిక్షణా తరగతులను అనుభవజ్ఞులైన అధికారులచే క్లాసులు నిర్వహించబడునని వారి నుండి నేర్చుకొని నైపుణ్యతను మెరుగు పరుచుకోవాలని అన్నారు. రక్షణ సూత్రాలను పాటిస్తూ సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని ఈ శిక్షణ తరగతులు 12 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం రామస్వామి, అధికారుల సంఘం అధ్యక్షులు ఎ.జి.శివ ప్రసాద్, గుర్తింపు సంఘం డి.రాజారామ్, ప్రాతినిధ్య సంఘం జే.వెంకటేశ్వర్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, వివిధ గనుల సూపర్‌ వైజర్లు ఉద్యోగులు పాల్గొన్నారు.