calender_icon.png 20 July, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌వీఎం స్కూల్‌లో స్టూడెంట్స్ ఎలక్షన్స్

20-07-2025 12:57:39 AM

ఖమ్మం, జూలై 19 (విజయక్రాంతి) ఖమ్మం శ్రీనివాసనగర్‌లో గల ఎస్‌వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో శనివారం వి ద్యార్థి సంఘ నాయకుల ఎన్నికలు జరిగా యి. ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రీటౌన్ సీఐ మోహన్ మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కిషో ర్ మాట్లాడుతూ..

విద్యార్థుల ఎన్నికలు నిర్వహించడం వలన ఓటు హక్కుకు ఉన్న ప్రా ధాన్యత తెలుస్తుందని తెలిపారు. మరో డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. వి ద్యార్థులకు సమాజం పట్ల, దేశం పట్ల, క్రి యాశీలకంగా వ్యవహరించాలని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలి యజేశారు.

పాఠశాల డైరెక్టర్ ఉమా కిషోర్ మాట్లాడుతూ.. మొత్తం మూడు విభాగాల్లో ఎన్నికలు నిర్వహించామని, సిపిఎల్, ఏఎస్పిఎల్, ఎస్పి ఎల్ విభాగాలలో వారికి నచ్చిన వారిని విద్యార్థి నాయకులుగా ఎన్నుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమం మొత్తం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ పర్యవేక్షించా రు. ఎన్నికల నిర్వహణ అధికారిగా సోషల్ టీచర్ నాగరాజు వ్యవహరించారు.