20-07-2025 10:56:07 AM
ప్రిన్సిపాల్ ఇంద్రకాంతి రాజశేఖర్
ఓయూ కామర్స్ విభాగంలో స్వచ్ఛ భారత్
ఉస్మానియా యూనివర్సిటీ: పరిశుభ్రత మనందరి బాధ్యత అని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఇంద్రకాంతి రాజశేఖర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కామర్స్ విభాగంలో శుక్రవారం విద్యార్థులు, ప్రొఫెసర్లతో కలిసి నిర్వహించిన స్వచ్ఛ భారత్‌లో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్‌లో విద్యార్థులు చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
క్యాంపస్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ పీ వెంకటయ్య (బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం), ప్రొఫెసర్ కే కృష్ణ చైతన్య (డీన్, కామర్స్ ఫ్యాకల్టీ), ప్రొఫెసర్ ఎం గంగాధర్ (కామర్స్ విభాగం), సీనియర్ ప్రొఫెసర్ డీ చెన్నప్ప, ప్రొఫెసర్ ఎస్ కవితా దేవి, డాక్టర్ జీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.