calender_icon.png 19 July, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థుల ప్రదర్శన

19-07-2025 02:56:38 PM

ఇల్లందు,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఇల్లందు పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హరీష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ మాట్లాడుతూ రూ.8వేల కోట్లకు పైగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయాలి.

అదే విధంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమయానికి స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 400 పైగా కళాశాలలు మూత పడ్డాయని ఇదే కొనసాగితే సామాన్య మధ్య తరగతి విద్యార్థులు విద్య పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందన్నారు. ప్రైవేట్ రాజీవ్ యువ వికాసాన్ని వెంటనే అమలు చేయాలని, కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాన్ని కల్పించాలని కోరారు.