calender_icon.png 20 July, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

19-07-2025 08:47:53 PM

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి..

హుజూర్ నగర్: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి(Municipal Commissioner Srinivasa Reddy) అన్నారు. నాసా స్పేస్ కాంటెస్ట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం పట్టణంలోని చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావుతో కలిసి అభినందించి మాట్లాడారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెంచుకొని ఫిజిక్స్ లో ప్రాజెక్ట్ చేసి జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులు సిరిమహేశ్వరి, మోక్షిత, యశ్వంత్, మనోజ్ సాయి, నిఖిలేష్ గౌడ్ లను జ్ఞాపికలను ప్రశంసా పత్రాలను మెడల్స్ ను అందజేశారు.

అలాగే నాసా స్పేస్ కాంటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులను మెడల్స్ తో అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. విద్యపై ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం స్పాట్ లివింగ్ కార్పొరేషన్ భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మొక్కలు నాటారు. మొక్కలను నాటి మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్,పర్యావరణ ఇంజనీర్ రాజశేఖర్,డీన్ ప్రేమ్ సాగర్, ఉపాధ్యాయులు ప్రియాంక, రామకృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.