calender_icon.png 20 July, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువులో రాణించాలి

19-07-2025 08:57:57 PM

స్టెల్లా మేరీ స్కూల్ ను సందర్శించిన ఎంఈఓ..

బూర్గంపాడు (విజయక్రాంతి): విద్యార్థులు చదువులో రాణించాలని ఎంఈఓ యదుసింహారాజు(MEO Yadusimharaju) అన్నారు. మండలంలోని మొరంపల్లి బంజర గ్రామంలోని స్టెల్లా మేరీ స్కూల్ ను శనివారం ఆయన సందర్శించారు. ఇటీవల కాంపిటేషన్ ఎగ్జామ్ లో రాణించిన విద్యార్థులకు పలు బహుమతులను అందజేశారు. స్కూల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని అన్నారు. విద్యలో రాణించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమలతను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ శరణ్య, నవనీత, శారద, భార్గవి, దివ్య, గ్రేసి, కుసుమాంజలి, సుజాత,మిన, వసంత కుమారి, అమల, స్వాతి, కతీజ, పుల్లయ్య, కౌశిక్,  శ్రీను తదితరులు పాల్గొన్నారు.