calender_icon.png 19 July, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు సూరయ్యపల్లి గ్రామస్తుల కృతజ్ఞతలు

19-07-2025 05:38:50 PM

మంథని (విజయక్రాంతి): మండల పరిధిలోని సూరయ్యపల్లి గ్రామంలోనీ ముదిరాజ్ కులస్తులు ఇటీవల రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) దృష్టికి కమ్యూనిటీ హాల్ వద్ద నీటి సమస్యను తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి బోర్ మంజూరు చేయించారు. శనివారం ముదిరాజ్ కులస్తుల కమ్యూనిటీ హాల్ వద్దకు బోర్ బండితో నాయకులు, గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టి బోరు వేయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. మా యొక్క సమస్యను తెలిపిన వెంటనే అర్థం చేసుకుని బోర్ సాంక్షన్ చేపించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్. మాజీ సర్పంచ్ మంథని కర్ణ కృష్ణ అన్నారు.