20-07-2025 04:52:42 PM
చిలుకూరు: చిలుకూరు మండల(Chilkur Mandal) ఎస్ఐగా వి.సురేష్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా సూర్యాపేట వీఆర్ లో పనిచేస్తున్న సురేష్ రెడ్డి, చిలుకూరు మండలంకు రావడం జరిగింది. ఇప్పటివరకు చిలుకు ఎస్సైగా ఉన్న ఎస్. రాంబాబు జిల్లా వీఆర్ కి బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.