20-07-2025 06:33:25 PM
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు..
చండూరు (విజయక్రాంతి): లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వృత్తిలో ప్రమాదాలు నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, చౌగాని సీతారాములు, వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలోని శీలా అనసూర్య శంకర్రావు ఫంక్షన్ హాల్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభలకు కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు చాపల మారయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.
గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. బడా పెట్టుబడిదారులు తయారు చేస్తున్న లిక్కర్లు, కోకో కోలా లాంటి శీతల పానీయాల వల్ల కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే ఈ పానియాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న మాట్లాడుతూ,కొంతమంది వ్యాపారులు కల్లు కల్తీ చేస్తున్నారనే నేపంతో కల్లు పైనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య కిట్లు ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలని, నల్లగొండ జిల్లాలోనే నీరా, తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని, నీరా కేఫ్ టెండర్ వేసి దాని ద్వారా ఆదాయం వచ్చే కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని వారన్నారు.
ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యదిలో సామాజిక చైతన్య యాత్రలను జిల్లాలోనే కాకుండా అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాలలో చైతన్య యాత్రలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, కల్లుగీత కార్మిక సంఘం సీనియర్ నాయకులు చాపల మారయ్య,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పామను గుండ్ల అచ్చాలు, ఉప్పల గోపాల్, గీత కార్మిక సంఘం నాయకులు జెర్రిపోతుల ధనుంజయ, మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, అయిత గోని మల్లేష్ గౌడ్, వేముల లింగస్వామి,సొసైటీ అధ్యక్షులు నకరకంటి బిక్షమయ్య, బోయపల్లి శంకరయ్య, గుణగంటి యాదయ్య, పడసబోయిన యాదగిరి, పెద్దగాని నరసింహ, బొమ్మరగోని నరసింహ, తందార్ పల్లి యాదయ్య, దేశిడి వెంకన్న, పడస బోయిన రామస్వామి,ఈరటి వెంకటయ్యతదితరులు పాల్గొన్నారు.