calender_icon.png 20 July, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట 2 గనిపై టిబిజికెఎస్ బాయిబాట

19-07-2025 08:00:10 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని కాసిపెట 2 గనిపై టిబిజికెఎస్ ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమం నిర్వహించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శనివారం గనిపై నిర్వహించిన కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ మాట్లాడారు.  టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలా పాలను ఉదృతం చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతుందన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తామని, సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు  ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందన్నారు.