calender_icon.png 19 July, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

19-07-2025 05:21:34 PM

అంగన్ వాడి, గ్రామపంచాయతీ బిల్డింగులకు శంకుస్థాపన..

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(Thungathurthi MLA Mandula Samuel) అన్నారు. శనివారం మండల పరిధిలోని వెంపటి తుంగతుర్తి మండల కేంద్రంలో నూతన అంగన్వాడీ బిల్డింగు, గ్రామపంచాయతీ 32 లక్షల నిధులతో నూతన బిల్డింగ్ కోసం శంకుస్థాపన కార్యక్రమం చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నట్టు తెలిపారు.

నూతన బిల్డింగులు సీసీ రోడ్లు డ్రైనేజీ నీళ్ల కోసం ప్రత్యేకంగా మంత్రి సీతక్కతో మాట్లాడి నిధులు సమకూరుస్తామని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐకమత్యంతో పనిచేసి గెలుపొందాలని కోరారు. వెంపటి నిరుపేద కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. అనంతరం వెంపటి పిఎస్సికి నూతన భవనం, ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం, ఐసిడిఎస్ నూతన భవనాల కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.