calender_icon.png 21 July, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కాన్పులు ముగ్గురు పిల్లల జననం

21-07-2025 12:20:52 AM

నిర్మల్, జూలై ౨౦ (విజయక్రాంతి): మామడ మండలం పొనకల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్, ప్రజ్ఞ దంపతులకు ఆదివారం ఉదయం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించినట్లు వైద్యులు తెలిపారు. డెలివరీ కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా ప్రజ్ఞకు పురిటి నొప్పులు బాగా రావడంతో వైద్యులు పరిశీలించి ముగ్గురు పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.

మొదటి కాన్పు కావడంతో వైద్యులు ద్వారా చికిత్స ముగ్గురు  కాన్పు చేయించారు. ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు ఉన్నట్టు వారంతా ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు వైద్యు లు తెలిపారు. తమకు ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించడం పట్ల తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.