19-07-2025 06:09:01 PM
పొంచి ఉన్న ప్రమాదం అని సూచించిన బాధ్యత లేని అధికారులు..
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): గత ఆరు నెలల క్రితం కాజ్ వే అంచున పొంచి ఉన్న ప్రమాదం అని సూచించిన అధికారులకు కనువిప్పు కలగలేదు. బాధ్యతాయుతంగా సమస్యను పరిష్కరించలేదు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాజ్ వే కూలిపోయింది. ఎల్లారెడ్డిపేట మండల(Yellareddipet Mandal) కేంద్రంలోని భక్తి సంఘం మీదుగా కోరుట్ల పేట వెళ్లే దారిలో ఉన్న కాజ్ వే ప్రమాదకరంగా మారిందని గత ఆరు నెలల క్రితం మీడియా ద్వారా రైతులు తమ గోడు వెళ్ళబోసుకొని కాజ్ వే బాగు చేయమని విన్నవించుకున్నారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు చూసి చూడనట్టు వదిలేశారు. కూలిన కాజ్ వే కాంగ్రెస్ నాయకులు పరిశీలించి పెద్దవాగుపై బిఆర్ఎస్ హయాంలోనే కాజ్ వే నిర్మించారని నాణ్యత లేకనే కూలిపోయిందని కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు.