calender_icon.png 20 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..

20-07-2025 05:45:16 PM

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మరల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..

మునుగోడు (విజయక్రాంతి): ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగ సభలో నేనే పదేళ్లు ముఖ్యమంత్రి అని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు మిరియాల వెంకన్న అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపైన చేసిన వాక్యాలు వాస్తవం అని అన్నారు. ఎన్నికలు, రాష్ట్ర పాలన అవకతవకలు జరిగితే ముఖ్యమంత్రిని మార్చే బాధ్యత కేంద్ర అధిష్టానికి ఉంటుంది. ముఖ్యమంత్రి 2035 వరకు నేనే ముఖ్యమంత్రి అని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు అవమానపరిచే విధంగా ఉన్నదని అన్నారు.

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మునుగోడు నియోజకవర్గం కాకుండా, జిల్లా వ్యాప్తంగా తిరిగి ఒక్క నియోజకవర్గ తప్ప మిగతా నియోజకవర్గాలు గెలిపించుకున్న పాత్ర రాజగోపాల్ రెడ్డిది. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన కొందరు కాంగ్రెస్ నాయకులు ధృతరాష్ట్ర పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి నిజాయితీ ఉంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్రం 2025 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, 2035 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని బహిరంగంగా ప్రజలకు చెప్పాలన్నారు.