19-07-2025 11:31:17 PM
కోయిలకొండ జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి..
కోయిలకొండ: కోయిలకొండలోని జెడ్పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(District Collector Viziendira Boyi) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేకంగా పరిశీలించి చేసిన పప్పు వెజిటేబుల్ కర్రీలో ఏది బాగుందని విద్యార్థులను అడిగారు. విద్యార్థులు వెంటనే వెజిటేబుల్ కర్రీ బాగుంది మేడం అంటూ సమాధానం ఇచ్చారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థులకు హెల్త్ చెకప్, కంటి పరీక్ష లు నిర్వహణ గురించి అడిగి సూచనలు చేశారు. అనంతరం పారుపల్లి గ్రామంలో జడ్.పి.ఉన్నత పాఠశాలను, జడ్.పి. ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు హాజరు గురించి హెడ్ మాస్టర్ ను అడిగారు. 180 మంది విద్యార్థులు హాజరు అయ్యారు అని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంచుతూ మంచి విద్యార్థులు నేర్పించాలని సూచించారు.