20-07-2025 07:15:25 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్లగొండ మండలం డిప్యూటీ తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అనేపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అన్నెపర్తి గ్రామము సర్వే నంబర్ 430/ఆ/1/1 లలో 1.36, 430 ఆ లో.2.36 ఎకరముల భూమి నా భర్త అంతటి లింగయ్య పేరు మీద ఉన్న భూమిని అక్రమార్కులు తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అడ్డుకోవడం జరిగిందని అయినా నాయబ్ తహశీల్దార్ (సబిత) బెదిరించి సీనియర్ సిటిజన్ అని చూడకుండా 10 మంది పోలీసుల సమక్షంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆర్డర్లను తుంగలో తొక్కి అన్ని ఆధారాలున్న ధరణి పాస్ బుక్కు, పాత పట్టా పాస్ బుక్కులు అన్నీ మా వద్దనే ఉన్నాయని ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నా భర్త పేరు మీద ఉన్న స్థిరాస్తి నాకే చెందాలని ఆ వ్యవసాయ భూమి తప్ప నాకు మరి ఏది లేదని అన్నారు. వ్యవసాయ భూమిని నా అధీనంలో ఉంచి 40 సంవత్సరాల క్రితం ఆంధ్రకు వెళ్లిపోయి అక్కడ వేరే ఆమెతో పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరారు.