19-07-2025 08:55:35 PM
పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి చందర్ రావు..
హుజూర్ నగర్: రాష్ట్రంలో విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పిడిఎస్యు(PDSU) జిల్లా కార్యదర్శి ఎం చందర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు పెండింగ్ బకాయిలను విడుదల చేయలేదన్నారు. విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు అందజేయాలన్నారు. జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యసంస్థల బంద్ లో విద్యార్థులు పాల్గొని విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పులి రాఖి, డివిజన్ అధ్యక్షుడు గుండు ఉమేష్, విష్ణు గౌతమ్, వేణు కిరణ్, క్రాంతి, రజిని నాగేంద్ర, గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.