calender_icon.png 2 December, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ మేడారంలో భక్తులతో జాతర సందడి..

12-02-2025 07:15:52 PM

మండ మెలుగుటతో సమ్మక్క- సారలమ్మల జాతర ప్రారంభం..

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మినీ మేడరంగా ప్రసిద్ధిగాంచిన తోగూడెం గ్రామంలో సమ్మక్క-సారలమ్మల సుంకు జాతర మంగళవారం ప్రారంభం కాగా సారాలమ్మ రాకతో బుధవారం ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆలయ ఆదివాసి పూజారులు భక్తిశ్రద్ధలతో ఆదివాసి సాంప్రదాయ డోలు వాయిద్యాల నడుమ సారాలమ్మను తీసుకొని వచ్చారు. గురువారం సమ్మకను వనంతో పాటు తీసుకురానున్నారు. జాతరకు వచ్చే భక్తులతో తోగూడెం ఆలయ పరిసర అటవీ ప్రాంతం భక్తులతో సందడిగా మారింది.