20-07-2025 10:40:05 PM
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సారయ్య..
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు సమాజంలో చలామణి అవుతున్న కులం మతం ప్రాంతం డబ్బు హోదా అనే అంతరాలు లేని సమాజ నిర్మాణమే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లక్ష్యమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సారయ్య అన్నారు. ఆదివారం మండల సమితి సమావేశంలో మాట్లాడుతూ.. సమాజంలో రోజురోజుకు డబ్బు పలుకుబడి కులం మతం ప్రాంతం హోదా అనేటువంటి అంతరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంతరాలు మరీ పెరిగాయని, కులం, మతం పేరుతో రాజకీయ హింస పెరిగిందని దళిత, మైనార్టీ, గిరిజనుల పైన దాడులు గతంతో పోల్చుకుంటే 100 రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోహిన్పూర్ అనే దళిత వాడలకు సందర్శించిన సందర్భంగా అక్కడున్న దళితుల జాతి వ్యక్తులకు సబ్బులు, షాంపూలు పంపి ముఖ్యమంత్రితో కలవాలంటే వీటితో స్నానం చేసి రావాలని హుకుం జారీ చేయడం జాతి అహంకారానికి నిదర్శనం అన్నారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక ముఖ్యమంత్రి పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, దళితులను అవమానించిన ముఖ్యమంత్రి పదవి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహసభలు జులై 26,27 తేదిలలొ అశ్వరావుపేట కేంద్రంగా జరగ నున్నాయని ఈ మహసభలొ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, సీనియర్ నాయకులు ఉడుత ఐలయ్య, మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, సహయ కార్యదర్శులు ఆకుల చందర్ రావు, బాషపాక రవి, గుగులొత్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు