19-07-2025 07:08:25 PM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..
బాన్సువాడ (విజయక్రాంతి): అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Agricultural Advisor Pocharam Srinivas Reddy) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, మండలాల లబ్ధిదారులకు 1569 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన వారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, అదనపు కలెక్టర్ కిరణ్ మై, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కృష్ణారెడ్డి, ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు.