calender_icon.png 20 July, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి

20-07-2025 06:00:40 PM

రాష్ట్ర గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి..

మందమర్రి (విజయక్రాంతి): అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ అమ్మవారికి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే  బోనాల జాతరను ప్రజలందరూ పాల్గొని సంప్రదాయాలను చాటుతున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి నిరంతరంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొట్టే సంపత్ కుమార్, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.