20-07-2025 01:23:05 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీల పిల్లలకు అందించే చిక్కి రేటు పెరుగనున్నదా? చిక్కి పంపిణీకి సంబంధించిన టెండర్ ప్రక్రియను గమనిస్తే ఈ ప్రశ్న ఉదయించక మానదు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వం చిక్కిల పంపిణీ చేస్తున్నది. కానీ టెండర్‌లో పేర్కొన్న చిక్కిల రేటు మాత్రం కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన టెండర్ ప్రకారం చిక్కి రేటు, రెట్టింపు కంటే ఎక్కువగానే పెరగనున్నది. గతంలో అందించే చిక్కి రేటుకు ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చిన చిక్కి రేటుకు పొంతనే లేదు. గత ప్రభుత్వం హయాంలో కేజీ చిక్కికి రూ. 200 చెల్లించేవారు. కానీ ఆ సమయంలో కేజీ చిక్కి మార్కెట్‌లో కేవ లం రూ.150 మాత్రమే. అయితే ప్రస్తుతం ప్రభుత్వం కేజీ చిక్కికి రూ.317 చొప్పున ఆర్డర్ ఇచ్చింది.
ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం ప్రభుత్వం కేజీ చిక్కికి చెల్లించే రేటు గతంలో ఇచ్చిన దాని కంటే రెట్టింపునకు పైనే అవుతుంది. గత ప్రభుత్వం ఈ సమయంలో ఉ న్న రేటు కంటే రూ.50 ఎక్కువగా చెల్లించింది. ప్రస్తుతం అదే చిక్కికి ఏకంగా రూ.167లను ఎక్కువగా చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు పౌ ష్టికాహారం అందించే లక్ష్యంతో మొదలైన చిక్కి పంపిణీ కార్యక్రమం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు..
చిక్కి పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఏ టెండ ర్ అయినా పూర్తి స్థాయిలో పరిశీలించి 30 రోజుల్లో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. కానీ ప్రస్తుతం ఆ నిబంధనలను పాటించలేదు. కేవలం 15 రోజుల్లోనే కాంట్రాక్టర్లకు టెండర్లను కట్టబెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన ఏ ముందస్తు సమావేశం నిర్వహించకుండానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు.
వాస్తవానికి నిబంధనల ప్ర కారం టెండర్ కేవలం ఏడాదిపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కానీ అందుకు విరుద్ధంగా టెండర్‌ను ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుకునేలా అవకాశం కల్పించారు. దీంతో పాటు చిక్కి రేట్లను కూడా కావాల్సిన విధంగా మార్చుకునే సదుపాయం కూడా ఇచ్చారు. తద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వా టిల్లే అవకాశముంది. ప్రాథమిక స్థాయి ఉన్నప్పుడు కాంట్రాక్టర్ ని బ ంధనలను పాటించినప్పటికీ ఆ తర్వాత వాటిని విస్మరించారు.