calender_icon.png 21 July, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల రక్షణలో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకం

20-07-2025 08:19:44 PM

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య..

మందమర్రి (విజయక్రాంతి): పని ప్రదేశాలలో ప్రమాదల నివారణకు, కార్మికులకు రక్షణ కల్పించడంలో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ల పాత్ర కీలకమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(AITUC) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ అధ్యక్షతన ఏరియా వర్క్ ఇన్స్పెక్టర్ల సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూలై 25న డిజిఎంఎస్ ఆధ్వర్యంలో సేఫ్టీ టైపార్టెడ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు సేఫ్టీ పర్సన్ గా వాహిలేషన్స్ ను అబ్జర్వ్ చేసి, డిజిఎంఎస్ దృష్టికి తీసుకుపోవాలని సూచించారు.

అదేవిధంగా మిగతా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, సేఫ్టీ పర్సన్ గా కార్మికులకు, యాజమాన్యానికి సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేకే 5 గనికి చెందిన మెకానికల్ ఫోర్ మెన్, సిఐటియు నాయకుడు కోరే సిద్ధాంత యూనియన్ లో చేరగా, ఆయనకు యూనియన్ కండువా కప్పి, సాధారణ యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, అన్ని గనుల, విభాగాల పిట్ కార్యదర్శులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.