calender_icon.png 20 July, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ

19-07-2025 10:06:59 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని మర్కల్, ధర్మారావుపేట్ గ్రామాల్లో నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు తాళం వేసి ఉన్న ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మర్కల్, ధర్మారావుపేట గ్రామాల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తాలాలు లేసిన ఇల్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. సంఘటనపై సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, కామారెడ్డి జిల్లా క్లూస్‌ టీం, ఫింగర్‌ప్రింట్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అదనంగా, సిసిఎస్ కామారెడ్డి  సహకారంతో సీసీటీవీ ఫుటేజ్‌లు మరియు ఇతర టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకున్నారు. 

ఇతర గ్రామాలలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు, తాళం వేసి ఇళ్లకు వెళ్లే వారు తమ విలువైన వస్తువులను పొరుగు వారికైనా, లేకపోతే తనతో తీసుకెళ్లాలనే సూచనలు పోలీస్ శాఖ తరచూ గ్రామాల్లో చాటింపు, వాట్సాప్ గ్రూపుల్లో ద్వార తెలియజేస్తున్నారు.తాళం వేసి ఇంటిని వదిలి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ పుష్ప రాజ్ సూచించారు. సంఘటనపై సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను గుర్తించి, వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ ఇంటిని తాళం వేసి వదిలి వెళ్లే ముందు పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.