20-07-2025 12:44:15 AM
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో నా యకులకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఎంతగా అంటే ఏ పార్టీలో లేనంతగా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు..ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శించాల్సిందిపోయి... వీళ్లకు వీరే విమర్శించుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. అసలు విషయం ఏందం టే నాగర్ కర్నూల్ జిల్లాలో తాజాగా జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పదేళ్లు తానే సీఎంగా ఉండడం ఖాయమని పేర్కొన్నారు.
అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 2034 వరకు తానే సీఎం అంటూ ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్దేశమేందో..
.ఎందుకు చేశారో పక్కనబెడితే...ఇలా బహిరంగంగా ప్రకటనలు చేసుకోవడం పార్టీకే నష్టమనే అభిప్రాయాలు క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని, కానీ రచ్చకెక్కుతే నష్టపోయేది పార్టీయే కదా! అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వీళ్లకు వేరే శత్రువులు అవసరం లేదు...వీళ్లకు వీరే శత్రువులు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రమేశ్ మోతె