నామినేషన్లకు మూడు అంచెల భద్రత
l మెదక్ జిల్లా ఎస్పీ బీ. బాలస్వామి
మెదక్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : మెదక్ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడు అంచెల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18నుంచి 25వరకు కొనసాగుతుందని, ఉదయం 11నుంచి మధ్యా హ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.
ఇందుకో సం సెంట్రల్ ఫోర్స్, ఆర్ముడ్, సివిల్ ఫోర్స్‌తో మూడు అంచెల భద్రత ఏర్పా టు చేసినట్లు వివరించారు. జిల్లా వ్యా ప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బం దోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్ నుంచి వంద మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.






