calender_icon.png 20 July, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడి మృతి

20-07-2025 01:10:24 AM

  1. మెదక్ జిల్లా రూప్లా తండాలో ఘటన
  2. సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ

శివంపేట్(మెదక్), జూలై 18 (విజయక్రాంతి): వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘ టన మెదక్ జిల్లా మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో జరిగింది. తండాకు చెందిన లావణ్య, ఓబ్యా దంపతుల కుమారుడు నితిన్ (3) శుక్రవారం సాయంత్రం ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్క లు ఒక్కసారిగా దాడి చేశాయి. విచక్షణా రహితంగా దాడి చేయడంతో నితిన్ తీవ్రంగా గాయపడ్డాడు.

నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా మెదక్ జిల్లా లో వీధి కుక్కలు చెలరేగుతున్నా, జి ల్లాలో పలుచోట్ల వీధి కుక్కల బారిన పడి మృత్యువాతకు గురవుతున్నా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. 

కేసు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రూప్లా తండాలో వీధికుక్క ల దాడిలో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ శనివారం స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించిం ది. 2020 నుంచి 2025 వరకు (నేటివరకు)రాష్ర్టంలో వీధికుక్కల దా డుల వల్ల సంభవించిన అన్ని మరణాలపై గణాంకాలతో కూడిన సమ గ్ర నివేదికను సమర్పించాలని సీఎస్‌ను హెచ్‌ఆర్‌సీ కోరింది.