calender_icon.png 20 July, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు లాల్‌దర్వాజ బోనాల జాతర

20-07-2025 12:56:32 AM

  1. అన్ని ఏర్పాట్లు పూర్తి
  2. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
  3. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతీ సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేడు (ఆదివారం) పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లోని భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా లాల్‌దర్వాజ సింహ వాహిని మహంకాళి ఆలయం, చారిత్రాత్మక అక్కన్న మాదన్న ఆలయం, ఇతర ప్రాంతాల్లోనూ వేడుకలు జరగనున్నాయి.

భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బోనాల సంబురాలు పాతబస్తీలోని పలు ఆలయాల్లో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహ వాహిని మహంకాళి ఆలయానికి పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాలన్నింట్లో సందడి కొనసాగుతోంది.

లాల్ దర్వాజ సింహవాహినితోపాటు, చందూలాల్ బేలలోని మాతే శ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాద న్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చాం ద్రాయణగుట్ట, మీరాలం మండి, గౌలిగూడ తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ బోనా ల ఉత్సవాలు జరగనున్నాయి. అన్ని ఆలయాలకు మెరుగులు దిద్దడంతోపాటు విద్యు త్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

బోనాల వేడుకల సందర్భంగా భక్తుల కు అసౌకర్యం కలగకుండా ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. లాల్ దర్వాజ ఆలయానికి వచ్చే భక్తులు వా హనాలు నిలిపేందుకు షాలిబండ ప్రధాన రోడ్‌పై, ఆర్యవైశ్యమందిర్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టర్మినల్, ఢిల్లీగేట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.