calender_icon.png 20 July, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు అత్యంత ప్రాధాన్యత

19-07-2025 10:11:17 PM

ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం..

నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికా రెడ్డి..

కోయిలకొండ: ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆర్థికంగా ఎదగాలని సంకల్పంతోనే ప్రజా పాలన ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ఆవిష్కృతం చేస్తుందని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికా రెడ్డి(MLA Dr. Parnika Reddy) స్పష్టం చేశారు. శనివారం మండలంలోని ఆచార్యపురం వీరభద్ర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆలోచనలతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలక కమిటీలకు మహిళా సంఘాల నుండి అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు పనులు హిళా సంఘాలకే అప్పగించడం జరిగిందన్నారు. మొబైల్ ఫిష్ యూనిట్, ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా ఆదాయం, మహిళలకి లోన్ బీమా, ప్రమాద బీమా అంద చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఐదు మందికి ప్రమాద బీమా వచ్చిన నిధులను అందజేయడంతో అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు.

నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ద్వారా నారాయణ పేటలో పెట్రోల్ బంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం ప్రారంభించడం జరిగిందని,  సోలార్ విద్యుత్ ప్లాంట్ లు మహిళా సోదరిమణులు ద్వారా నిర్వహించేందుకు ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద నియజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోయిలకొండ మండలంలో రూ 94 లక్షలను వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు, ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని, అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంకే  సాధ్యమన్నారు.  కోయిలకొండ మండలంలో కరెంట్ సమస్యలు లేకుండా  రామ్ పూర్, కోయిలకొండ, అంకిలంలో దాదాపు రూ 10 కోట్లతో మూడు సబ్ స్టేషన్లు  మంజూరు చేసుకొని సబ్ స్టేషన్లకు శంఖుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి భవన్  నారాయణ పేట నియోజకవర్గంలో రూ 5 కోట్లతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు,రెండు లక్షల లోపు రుణ మాఫీ,200 యూనిట్ ల లోపు  ఉచిత కరెంట్, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు.

మంచి ఆలోచనలతోనే ఎదుగుదల సాధ్యం: కలెక్టర్ 

మంచి ఆలోచనలతో నూతన విధానాలకు శ్రీకారం చుడితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  నారాయణపేట నియోజకవర్గంలో కోయిలకొండ వద్ద  ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవడం. సంతోషించాల్సినా విషయమన్నారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఆదాయ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గేదెలు,పౌల్ట్రీ ఫామ్ లు, చిన్న వ్యాపారాలు ఇలాంటి చాలా కార్యక్రమాలకు రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యమంత్రి  మహిళల ద్వారా చేసే కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని  తెలిపారు.

స్కూల్ యూనిఫాం లు మహిళ సంఘాల ద్వారా కుట్టడం, మహిళ సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల మహిళలకు ఇవ్వడం, సోలార్ పవర్ యూనిట్ లను మహిళలను పారిశ్రామిక వేత్తలు గా తీర్చిదిద్దబోతున్నామని, గో డౌన్ ల నిర్వహణ, పెట్రోల్ బంకులు నిర్వహించడం వంటివి మహిళ ల జరిగేలా చూస్తున్నామని. మహిళలకు ఆదాయం వస్తె కుటుంబం బాగు పడుతుందని. ఊరు బాగాపడేందుకు మహిళలు కలిసి పనిచేయాలని, మహిళలు సంఘాలలో చేరాలని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డి.అర్.డి. ఓ నరసింహులు, అడిషనల్ డిఆర్డిఓ శారద, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.