calender_icon.png 20 July, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న విగ్రహావిష్కరణ కు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం

19-07-2025 07:20:52 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud)ను విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తో కలిసి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్ ను ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు జెర్రీపోతుల వెంకన్న గౌడ్, కోశాధికారి బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్, ముత్యం వెంకన్న గౌడ్, బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, పెద్ది వెంకన్న గౌడ్ తదితరులున్నారు.