20-07-2025 10:59:10 PM
44 కేసులు నమోదు..
ఖమ్మం (విజయక్రాంతి): ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 44 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ(Traffic CI Bellam Satyanarayana) తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 6 కార్లు, 2 ఆటోలు, 36 ద్విచక్ర వాహనదారులు మధ్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రెండు నెంబర్ ప్లేట్ లేని బైక్స్, రెండు సైలెన్సర్ మార్చిన బైక్స్ సీజ్ చేయడం జరిగిందని అన్నారు. కావున వాహనాలు నడిపే వారు తప్పకుండ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా, బుల్లెట్ బైక్స్ కి సైలెన్సర్ మార్చి అధిక శబ్దంతో నడపరాదని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ లు రవి, రాము, సాగర్, అమీర్ అలీ, వెంకటేశ్వరావు, సిబ్బంది పాల్గొన్నారు.