calender_icon.png 20 July, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి

20-07-2025 05:05:40 PM

41 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ. 14 లక్షల చెక్కులను పంపిణీ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి

ఖమ్మం (విజయక్రాంతి): నెలకొండపల్లి మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.14 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేలకొండపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి(Camp Office In-charge Tumburu Dayakar Reddy) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని 18 ఎంపీటీసీ 32 సర్పంచ్ ల స్థానాలను మొత్తం మనమే గెలుచుకోవాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందన్నారు. 

నాయకులు గ్రామాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధి చాలా బృహత్తరమైందని, గత ప్రభుత్వంలో ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు రెండు మూడు నెలలలోనే ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు వస్తున్నాయని తెలిపారు. మనందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి అండదండలుగా ఉండాలని కోరారు.