19-07-2025 08:28:59 PM
ఖమ్మం,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన జర్నలిస్ట్ వెంపటి నాయుడుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి జె ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవిలతో కూడిన జర్నలిస్టుల బృందం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. గత కొన్ని రోజులు క్రితం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి కుటుంబ సమేతంగా తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంపటి నాయుడు తోపాటు అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (టి జె ఎఫ్) జిల్లా కమిటీ స్పందించి ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జర్నలిస్టు వెంపటి నాయుడు నివాసానికి వెళ్లి శనివారం పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బంది వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జర్నలిస్టు వెంపటి నాయుడుకు అందజేశారు.