19-07-2025 05:11:57 PM
నియామక ఉత్తర్వులు అందజేసిన డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ..
కరీంనగర్ (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వరాల నరసింగంని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana) నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా గతంలో జిల్లా కాంగ్రెస్ నాయకునిగా పార్టీకి సేవ లందించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ పట్ల నా విధేయతను గుర్తించిన మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నాకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పదవి ఇచ్చిన డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెరిపే లక్ష్యంగా పనిచేస్తానని వరాల నరసింగం తెలిపారు.