20-07-2025 01:01:33 AM
ఈ నెల 21 రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనావేసింది. మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కా మారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఈ నెల 21 న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక అన్ని జిల్లాల పరిధిలోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి న వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.