calender_icon.png 19 July, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ : జి.యం

19-07-2025 02:41:32 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో ఉపరితల గనుల పరిసర ప్రాంతల యువకులకు, భూనిర్వసితులకు, మాజీ ఉద్యోగుల పిల్లలు, ఓ.సి విస్తరణ ప్రభావిత గ్రామాలైన యువకులకు హెవీ మోటార్ డ్రైవింగ్ (వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్) గా శిక్షణ ఇవ్వనున్నట్లు సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకై కనీస అర్హత 10 వ తరగతి ఉత్తీర్ణులై 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని, హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ నందు 3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని,  ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఇల్లందు ఏరియా లోని యం.వి.టి.సి కార్యాలయంలో సంబంధించిన పత్రాల జిరాక్స్ లు (విద్యఅర్హత కుల ధృవీకరణ పత్రం వయసు నిర్ధారణ చిరునామా హెవీ మోటార్ లైసెన్సు) జోడించి  ఈ నెల 21 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.