20-07-2025 12:34:57 PM
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలోని నాగార్జుసాగర్ ఎడమ కాల్వకు తాగు నీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగు నీటి అవసరాల దృష్ట్యా మాత్రమే నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల తాగు,నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వకు అధికారులు అధివారం నీటిని విడుదల చేశారు వెయ్యి క్యూసెక్కులతో ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించి క్రమంగా నీటి విడుదలను పెంచుతూ మూడు వేల క్యూసెక్కులతో కొనసాగుతున్న అధికారులు వరకు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 565.50 అడుగులకు చేరింది