20-07-2025 01:06:33 AM
సంగారెడ్డి, జూలై 19 (విజయక్రాంతి): సాంకేతిక పరివర్తన పురోగతిలో, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ మిషన్‌లో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని, గత దశాబ్ధ కాలంగా ఎంతో ప్రగతిని సాధించామని కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నాలుగు బంగారు పతకాలు, 44 వెండి పతకాలను విద్యార్థులకు అందజేశారు. టెక్నాల జీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)తో సహా క్యాంపస్ సౌకర్యాల ను మంత్రి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంపై వ్యక్తిగత ఆలోచనలను పంచుకుంటూనే పట్టభద్రులైన విద్యార్థులకు, అధ్యాప కులు, సిబ్బందికి అభినందన లు తెలిపారు.
భారతదేశం సాంకేతిక పరివర్తన పురోగతిని, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్ మిషన్‌లతో ఎంతో ప్రగతి సాధిస్తున్నామని తెలిపా రు. 60 సంవత్సరాల ఆకాం క్ష తర్వాత భారతదేశం చివరకు 2025లో తన మొదటి వాణిజ్య-స్థాయి చిప్‌ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. ఆరు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని, ప్రధా న డిజైన్, ప్రతిభ అభివృద్ధి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ము ఖ్యంగా, విద్యార్థులు రూపొందించిన 20 సెమీకండక్టర్ చిప్లలో 8 వరకు ఐఐటీ హైదరాబాద్ నుండి ఇప్పటికే విజయవంతంగా టేప్ చేయబడ్డాయని అన్నారు. ఏఐ మిషన్ కింద దేశం సాధించిన పురోగతులను మంత్రి వివరించారు. భారతదేశం కేవలం మూడున్నరే ళ్ళలో 5-జీకి అప్‌గ్రేడ్ చేయగల దాని సొంత 4-జీ స్టాక్‌ను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి భారతదేశాన్ని తిరిగి రెండు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నడిపించాలని నేటి యువతకు పిలుపు నిచ్చారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీవైఐఈఎన్టీ వ్యవస్థాపక చైర్మన్, ఐఐటీ హైదరాబాద్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి అశ్విని వైష్ణవ్ డిగ్రీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.