20-07-2025 12:42:57 AM
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): తిరుమలలో హిందూయేతరులు ఉద్యోగులుగా పనిచేయడం సరికాదంటూ గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్ టీటీడీకి ఫిర్యాదు చేయగా.. స్పందించిన టీటీడీ తాజాగా నలుగురు అన్యమతస్తులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్న ట్టు విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో.. నలుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసంది. బండి సంజయ్ టీటీడీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంకా వందలా ది మంది హిందూయేతరులు పనిచేస్తున్నారని.. వారిని తొలగించాలని కోరారు.