20-07-2025 11:03:54 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే బస్సు భవన్ ని ముట్టడిస్తామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని రాజయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డివిజన్ అధ్యక్షుడు ఆర్ చారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. విశ్రాంతి ఉద్యోగల సమస్యలు ఏండి దృష్టికి తీసుకు వెళుతున్నామని, రిటర్మెంట్ కార్మికుల బెనిఫిట్స్, 2017 ఏరియర్స్, అయ్యార్ పెన్షన్ డబ్బులుకట్టిన వారందరికీ పెన్షన్ డబ్బులు, ఏరియాస్ పలు విషయాల పిఎఫ్ కమిషన్ బర్కత్పురాన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.
రిటైర్మెంట్ కార్మికులకు అందవలసిన అన్నిటిని వెంటనే చెల్లించాలని లేకుంటే పిఎఫ్ ఆఫీస్ బర్కత్పురాను, ఎండి ఆఫీస్ బస్సు భవన్ ను రాష్ట్రవ్యాప్త రిటైర్మెంట్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ముట్టడిస్తామని హెచ్చరించారు. కష్టాలలో అదుగోల్సిన అధికారులు బెనిఫిట్స్ అందించకుండా కష్టాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కి తెలియజేస్తుందన్నారు . కార్మికులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ సంఘం సాయి శక్తుల కృషి చేస్తుందన్నారు. అందరూ ఏకమై సంఘానికి మద్దతు తెలిపాలని కార్మికులకు సూచించారు.
డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
గౌరవ అధ్యక్షునిగా ఒడితల ప్రణవ్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా వేల్పుల ప్రభాకర్, అధ్యక్షుడిగా మార్త రవీందర్, ఉపాధ్యక్షుడిగా ఏవిఆర్, నర్సయ్య, వివిఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పేరాల లక్ష్మణరావు, సహాయ కార్యదర్శిగా ఉపేందర్, పోరెడ్డి సమ్మిరెడ్డి తో పాటు తదితరులను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, సామాజిక ఉద్యమ నేత వేల్పూర్ రత్నం, రాష్ట్ర కార్యదర్శి పంజాల వెంకటయ్య, స్వామి, మల్లయ్య, రాజమౌళి, ఏం రాజమౌళి, బాబు రెడ్డి, డివై గౌడ్,ఎస్ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.