calender_icon.png 21 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తా: మంత్రి వివేక్

21-07-2025 12:26:29 AM

చెన్నూర్, జూలై 20 : ప్రభుత్వ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం మండలంలోని కిష్టంపేటలో ఏర్పాటు చేసిన ఇందిరా మహి ళా శక్తి సంబరాలలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించి అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలలో ఎలాంటి అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తా మని, ప్రభుత్వం మహి ళల ఆర్థిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక మార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన పొందే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.

చెన్నూర్ నియోజకవర్గంలో 8 వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.